టాస్‌ గెలిచి మొదట బౌలింగ్‌ ఎంచుకున్న టీమిండియా

నవతెలంగాణ – హైదరాబాద్: స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇదివరకే తొలి టీ20 గెలిచిన ఊపుమీదున్న భారత్‌.. నేడు ఇండోర్‌ వేదికగా రెండో టీ20 ఆడుతున్నది. ఇండోర్‌ లోని హోల్కర్‌ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత సారథి రోహిత్‌ శర్మ టాస్‌ గెలిచి మొదట బౌలింగ్‌ ఎంచుకున్నాడు. అఫ్గాన్‌ తొలుత బ్యాటింగ్‌ చేయనుంది. మొహాలీ వేదికగా ఈనెల 11న ముగిసిన మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లో గెలిచి ఇక్కడే సిరీస్‌ పట్టేయాలని పట్టుదలతో ఉంది. టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ.. 14 నెలల తర్వాత అంతర్జాతీయ స్థాయిలో టీ20 మ్యాచ్‌ ఆడనుండటం విశేషం. 2022 నవంబర్‌లో ఆసీస్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌ తర్వాత కోహ్లీ మళ్లీ ఇంటర్నేషనల్‌ టీ20 ఆడనుండటం ఇదే ప్రథమం. కోహ్లీ రాకతో టీమిండియా తుది జట్టులో పలు మార్పులు జరిగాయి.
తుది జట్లు:
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లీ, శివమ్‌ దూబే, జితేశ్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), రింకూ సింగ్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ముకేశ్‌ కుమార్‌
అఫ్గానిస్తాన్‌: రహ్మనుల్లా గుర్బాజ్‌ (వికెట్‌ కీపర్‌), ఇబ్రహీం జద్రాన్‌ (కెప్టెన్‌), అజ్మతుల్లా ఒమర్‌జయ్‌, నజీబుల్లా జద్రాన్‌, మహ్మద్‌ నబీ, గుల్బాదిన్‌ నయీబ్‌, కరీమ్‌ జనత్‌, ఫజల్‌హక్‌ ఫరూఖీ, నవీన్‌ ఉల్‌ హక్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌, నూర్‌ అహ్మద్‌

Spread the love