తెలంగాణకు ఎల్లో అలర్ట్..వాతావరణ శాఖ హెచ్చరిక

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 23వ వరకు ఐదు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. జూన్ 16 నుంచి 17వ తేదీ ఉదయం వరకు కామారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మెదక్, నిజామాబాద్, ఆసిఫాబాద్, కామారెడ్డి, మంచిర్యాల, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మల్కాజ్ గిరి, ములుగు, రంగారెడ్డి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హైదరాబాద్, సూర్యాపేట, నల్లగొండ, మేడ్చల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించింది. అదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.

Spread the love