ఘనంగా తెలంగాణ ఆవిర్బవ దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ – శంకరపట్నం
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని  శంకరపట్నం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ అనుపమ జాతీయ జెండా ఎగురవేశారు.  ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో, పలు గ్రామ పంచాయతీల్లో,పోలీస్ స్టేషన్, ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపగాని బసవయ్య గౌడ్, కొత్తగట్టు ఆలయ చైర్మన్ ఉప్పు గళ్ళ మల్లారెడ్డి,బండారి తిరుపతి,ఏపీవో శారద కార్యాలయం సిబ్బందితదితరులు పాల్గొన్నారు.
Spread the love