
నవతెలంగాణ- యాదగిరిగుట్ట:
యాదగిరి గుట్ట మండలం రామాజిపేట గ్రామం మంగళవారం, తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జాయింట్ సెక్రెటరీగా యాదగిరిగుట్ట మండల రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు మొగిలిపాక రమేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జాయింట్ సెక్రెటరీగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు నాయికోటి రాజుకి, కార్యదర్శి కందుల శంకర్ కి, జిల్లా అధ్యక్షులు ఎలుగుల రాజయ్యలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రేషన్ డీలర్ల సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని రమేష్ తెలిపారు.