తెలుగుదేశం పార్టీ శ్రేణుల సంబరాలు..

నవతెలంగాణ – శంకరపట్నం
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడంతో మంగళవారం  శంకరపట్నం మండల కేంద్రంలో టీడీపీ మండల అధ్యక్షుడు సయ్యద్ ఆరిఫ్ ఆధ్వర్యంలోపార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన సందర్భంగా మండల కేంద్రంలో బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ విజయంతో తెలంగాణలో టీడీపీ పార్టీ శ్రేణులకు ఆశలు చిగురించినట్లు, త్వరలో తెలంగాణలో కూడా పార్టీ తిరిగి పుంజుకోనున్నట్లు, ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ  సీనియర్ నాయకులు వీరమల్లు, తిరుపతి, వెంకటేష్, మల్లేష్, కిట్ట స్వామి, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love