– జమ్మికుంట లెదర్ పార్క్ ఆర్టిజన్స్, చర్మకారుల సంఘం
నవతెలంగాణ – జమ్మికుంట
2024 బడ్జెట్లో తెలంగాణలో 2 లెదర్ పార్క్ లు హైదరాబాద్, కరీంనగర్ లో ఏర్పాటు చేస్తామని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పరిశ్రమల శాఖ మంత్రి లకు జమ్మికుంట లెదర్ పార్క్ చర్మకారుల సంఘం కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దశాబ్ద కాలంగా నిర్లక్ష్యానికి గురైన లిడ్ క్యాప్ భూముల్లోవెంటనే లెదర్ పార్కులను ప్రారంభించి ,ట్రైనింగ్ పొందిన ఆర్టిజన్స్ కి దళిత మాదిగ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. గత తొమ్మిది సంవత్సరాలుగా గత ప్రభుత్వం మాదిగ లను నిర్లక్ష్యం చేసిందని వారు మండిపడ్డారు. వెంటనే ప్రస్తుత టి ఎస్ ఎల్ పిఎస్సి, లిడ్ క్యాప్ భూముల్లో పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ ఉపాధి కల్పించాలని కోరారు . ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఫ్రంట్ వ్యవస్థాపకులు డా. ఆరెపల్లి రాజేందర్,మొలుగు రాజు, జమ్మికుంట చర్మకారుల సంఘం అధ్యక్షులు, కార్యవర్గ సంఘం రామంచ రాజారాం , మనేష్ ,మడిపెళ్లి రమేష్, పోశెట్టి, స్వామి, మొగిలి, కొండయ్య, భూమయ్య , వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.