Thursday, May 14, 2026
E-PAPER
Homeసినిమాఅదే 'రాజా ది రాజా` ప్రత్యేకత..

అదే ‘రాజా ది రాజా` ప్రత్యేకత..

- Advertisement -

రుత్విక్‌ను హీరోగా పరిచయం చేస్తూ వృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కె.నిహారిక దాసరి చిత్రం ‘రాజా ది రాజా’. యువత తమ కలల కోసం పరుగులు తీయడం, తల్లిదండ్రులు తమ ఆశయాలను పిల్లలపై రుద్దడం వంటి నేటి తరానికి కనెక్ట్ ఎలిమెంట్స్, అందమైన ప్రేమకథతో మేళవిస్తూ ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్ర టీజర్‌ను ఆవిష్కరించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ,‘రిత్విక్, నిహారిక ఫ్యామిలీ ఫ్రెండ్స్. రిత్విక్ జర్నీని నేను దగ్గరగా చూశాను. చాలా డెడికేషన్‌తో వర్క్ చేశాడు. నిహారిక ఈ సినిమాను చాలా గ్రాండ్‌గా నిర్మించారు. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే’ అని అన్నారు. ‘ఈ సినిమాలో ఒక పాట చూశాను. చాలా బాగుంది. రిత్విక్‌లో చాలా మంచి ఈజ్ ఉంది. తనకి ఆల్ ది వెరీ బెస్ట్. పిల్లల కల నెరవేరాలా? లేక తల్లిదండ్రులు తమ పిల్లల కోసం కనే కలలు నెరవేరాలా? ఈ కాన్సెప్ట్‌తో సినిమా రాబోతోంది. ఇందులోని పాయింటే ఈ సినిమాకి ప్రత్యేకత. అని డైరెక్టర్ హను రాఘవపూడి చెప్పారు. మరో డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ, ‘టీజర్ చాలా బాగుంది. ఈ టీజర్ చూస్తుంటే నిహారికకి తన బ్రదర్‌పై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది. తప్పకుండా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. నిర్మాత మైత్రి రవి మాట్లాడుతూ,‘టీజర్ చాలా రిచ్‌గా ఉంది. నిహారిక చాలా గ్రాండ్‌గా నిర్మించారు. రిత్విక్‌కు కూడా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ‘ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాను. ఈ సినిమాను నిర్మించిన మా అక్కకి, మా డైరెక్టర్‌కి, టెక్నీషి యన్స్‌కి, నటీనటులందరికీ థ్యాంక్యూ. నన్ను యాక్టర్‌గా గుర్తిస్తారని, ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను’ అని హీరో రుత్విక్ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -