Saturday, June 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసాంకేతిక వ్యవసాయ పరిజ్ఞానానికి అగ్రివర్సిటీ దిక్సూచి కావాలి

సాంకేతిక వ్యవసాయ పరిజ్ఞానానికి అగ్రివర్సిటీ దిక్సూచి కావాలి

- Advertisement -


వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఘనంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ 62వ ఆవిర్భావ దినోత్సవం


నవతెలంగాణ-రాజేంద్రనగర్

సాంకేతిక వ్యవసాయ పరిజ్ఞానానికి అగ్రికల్చరల్‌ ‌యూనివర్సిటీ దిక్సూచి కావాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌‌లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో యూనివర్సిటీ 62వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడారు. తెలంగాణకి, దేశానికి 62 ఏండ్లుగా ఈ విశ్వవిద్యాలయం అసమాన సేవలు అందిస్తోందని అన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయం వివిధ పంటల్లో రూపొందించిన సుమారు 520 వంగడాలు రైతుల మన్ననలు పొందాయని తెలిపారు. వేల మందిని పట్టభద్రులుగా తీర్చిదిద్దిందన్నారు. ఇందిరా గాంధీ, స్వామినాథన్ వంటి ప్రముఖ శాస్త్రవేత్తల తోడ్పాటుతో అమలు చేసిన హరిత విప్లవం కారణంగా నేడు ఆహార ఉత్పత్తుల్ని ఎగుమతి చేసే స్థాయికి దేశం ఎదిగిందన్నారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశం ఆహార భద్రత సాధించడంలో, నేడు దేశం ఆహార ధాన్యాలని ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవడానికి ఇందిరాగాంధీ అమలు చేసిన హరిత విప్లవమే ప్రధాన కారణమన్నారు.

వ్యవసాయ వర్సిటీ వంటి సంస్థల స్థాపన అందుకు దోహదం చేసిందన్నారు. నేడు వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్ళ పరిష్కారానికి విశ్వవిద్యాలయం మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇండియన్ స్థాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ అండ్ హెడ్ మధుర స్వామినాథన్ మాట్లాడుతూ.. హరిత విప్లవం తర్వాత భారతదేశంలో ఉత్పత్తి, దిగుబడులు బాగా పెరిగి ఎగుమతులు చేసే స్థాయికి ఎదిగామని అన్నారు. అనేక ఆహార ఉత్పత్తుల్లో అధిక దిగుబడులు సాధిస్తున్నప్పటికీ నూనె గింజలు, పప్పు ధాన్యాల ఉత్పత్తిలో ఇంకా వెనుకబడే ఉన్నామని మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులకు మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు కమిషన్ చైర్మెన్ కోదండ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఉపకులపతి జానయ్య, రైతు సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, రాజు రెడ్డి, జాన ప్రకాష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -