Saturday, June 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపట్టాల పంపిణీతో భావితరాలకు శాశ్వత భూ హక్కులు

పట్టాల పంపిణీతో భావితరాలకు శాశ్వత భూ హక్కులు

- Advertisement -

ప్రత్యేక ప్రజాదర్బార్ ద్వారా గ్రామాలకే ప్రభుత్వ సేవలు : పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
నవతెలంగాణ-ములుగు
భూములకు పట్టాల పంపిణీ ద్వారా భావితరా లకు శాశ్వత భూ హక్కులు కల్పించనున్నామని, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికే ప్రత్యేకంగా ప్రజా దర్బార్ కార్యక్ర మాన్ని నిర్వహిస్తున్నామని పంచాయతీరాజ్, గ్రామీ ణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. శుక్రవారం ములుగు జిల్లా మల్లంపల్లి మండలం రామచంద్రపూర్ గ్రామంలోని రైతు వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజాదర్బార్ కార్యక్రమంలో మండలంలోని గిత్తూర్‌తండా, కొడిశాలకుంట, ముద్దునూరుతండా, రామచంద్ర పూర్, భూపాల్‌నగర్, శివతండా గ్రామ పంచాయ తీల పరిధిలోని ప్రజల నుంచి మంత్రి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తో కలిసి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సంవత్సరాలు గా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ప్రజలకు న్యాయం చేసే దిశగా ప్రజా ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోంద న్నారు. ప్రత్యేకంగా రామచంద్రపూర్ గ్రామ పరిధిలో సుమారు 10,600 ఎకరాల భూములకు సంబంధిం చిన 30నుంచి 40సంవత్సరాలుగా కొనసాగుతున్న సమస్యలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించి, సీఎం చేతుల మీదుగా రైతులకు పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

అలాగే, రైతులకు పూర్తి స్థాయిలో వ్యవసాయ భరోసా కల్పించేందుకు రెండు పంటలకు సమృద్ధిగా సాగునీరు అందించే ప్రత్యేక ప్రణాళికలను ప్రభుత్వం రూపొందిస్తోందని తెలిసారు. ప్రజాదర్బార్ కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ త్వరిత గతిన పరిష్కార చర్యలు చేపడుతున్నామని అన్నారు. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ.. ప్రజాదర్బార్ కార్యక్రమానికి ప్రధానంగా పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, భూ సమస్యలు, గ్రామస్థాయి స్థానిక సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయని తెలిపారు. ఫిర్యాదు దారులు సంబంధిత అంశంపై వివరాలు నమోదు చేసిన వెంటనే ఎంపీడీఓ, ఎంపీఓ, తహసీల్దార్ స్థాయిలో పరిశీలన చేపడతామని చెప్పారు. జిల్లా స్థాయిలో పరిష్కారం సాధ్యమైతే వెంటనే చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర స్థాయిలో పరిష్కారం అవసరమైతే సంబంధిత శాఖల ప్రధాన కార్యాలయాలకు పంపించి త్వరి తగతిన పరిష్కరించే చర్యలు చేపడతామని తెలిపారు. అనంతరం మంత్రి అనసూయ సీతక్క అంగన్‌వాడీ పిల్లలకు అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -