– టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్
నవతెలంగాణ-కేశంపేట
సామాన్య ప్రజల అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యమని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే బడుగు, బలహీన వర్గాలు ఎంతో అభివృద్ధి చెందాయని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం మండలంలోని ఇప్పలపల్లి గ్రామంలో మండల అధ్యక్షు లు గూడ వీరేశం ఆధ్వర్యంలో గడపగడపకూ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. ఈసారి ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించేందకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యాదయ్యయాదవ్, కేశంపేట్ మాజీ సర్పంచ్ శ్రీధర్‌రెడ్డి, కేశంపేట్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భాస్కర్‌గౌడ్, నాయకులు గిరి యాదవ్, పెంటయ్య, తుమ్మల గోపాల్, నర్సింహులు, కర్ణాకర్‌రెడ్డి, రూపాలనాయక్, మాజీ సర్పంచ్ కృష్ణవేణివెంకటేష్, ఉప సర్పంచ్ పిప్పళ్ళ రాములు, 1వార్డు సభ్యులు విష్ణు మమత, 2వార్డు సభ్యులు శ్రీను మమత, 6వ వార్డు సభ్యులు శంకరయ్య,7వ వార్డు సభ్యులు హనుమమ్మ, 8వవార్డు సభ్యులు బేరి సురేందర్ పాల్గొన్నారు.