మహిళా చిత్రం తయారీలో కళాకారుని నైపుణ్యం

నవతెలంగాణ – మద్నూర్
మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆర్ట్స్ ఉపాధ్యాయినిగా విధులు నిర్వహించే భాసా బాలకిషన్ మహిళా దినోత్సవం పురస్కరించుకొని కూరగాయలతో మహిళా చిత్రపటాన్ని తయారు చేయడంలో ఆ కళాకారుడు నైపుణ్యం ప్రదర్శించారు. కూరగాయలతో తయారుచేసిన మహిళా చిత్రం చూసి ప్రతి ఒక్కరూ ఆ కళాకారులు నైపుణ్యానికి అభినందిస్తున్నారు. అప్పుడప్పుడు ప్రభుత్వ పరంగా జరుపుకుని రకరకాల దినోత్సవాలకు ఆయన నైపుణ్యం ద్వారా చిత్రాలు తయారుచేసి అందరిని ఆకర్షితులవుతారు. కూరగాయలతో తయారైన మహిళా చిత్రం అందరిని ఆకర్షించింది.
Spread the love