తిరుమలగిరిలో బీఆర్‌ఎస్‌ కు బిగ్ షాక్ పలువురి రాజీనామా

నవతెలంగాణ- తిరుమలగిరి: ఉద్యమ నాయకుడు బీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ మండల అధ్యక్షులు దుంపల కృష్ణారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుంకరి  జనార్దన్ ఆధ్వర్యంలో గురువారం సుమారు 500 మంది బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేశారు. వీరిలో ప్రధాన నాయకులు తిరుమలగిరి మండల బీఆర్‌ఎస్‌ పార్టీ ఉపాధ్యక్షులు కందుకూరి లక్ష్మయ్య, పట్టణ అధ్యక్షులు తిరుమని  యాదగిరి, కౌన్సిలర్ బత్తుల శ్రీనివాస్, మార్కెట్ డైరెక్టర్ కిష్టు నాయక్, హీరూ నాయక్ బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మాజీ మండల పార్టీ అధ్యక్షులు దుంపల కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎన్నో ప్రయాసలకు ఓర్చి నాటి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొని జెండాలు మోసి, ఉద్యమాలను తీవ్రతం చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమకారులను పక్కనపెట్టి  ప్రజాప్రతినిధులుగా భాగస్వాములుగా చేయకపోవడం, ఉద్యమంలో లేనివారికి చోటు కల్పించడం మూలంగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గంలో అవినీతి దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన తెలంగాణ ఉద్యమకారుడు నిస్వార్థ సేవ పరుడు ప్రజలకు అందుబాటులో ఉండే మందుల సామెల్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కందుకూరి రోశయ్య, పానుగంటి గణేష్, రఘు నందన్, కందుకూరి అంజయ్య  తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love