గ్రామ దేవతల ఆశీస్సులు అందరిపై ఉండాలి

. అచ్చమాయపల్లి  గ్రామదేవతల ప్రతిష్టకు ఎంపీ హజరు 
. ఎంపీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామస్తులు 
నవతెలంగాణ-దుబ్బాక రూరల్
గ్రామ దేవతల ఆశీస్సులు అందరిపై ఉండాలని మెదక్ ఎంపీ అన్నారు. శనివారం దుబ్బాక మండల పరిధిలోని అచ్చమాయపల్లి  గ్రామదేవతల ప్రతిష్టను  గ్రామస్తులు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరై అమ్మవారినీ దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా  అమ్మవారు కృప కటాక్షంతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎంపీకి సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి కడతాల రవీందర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ షేర్ల కైలాస్ , ఎంపీటీసీ రామ్ రెడ్డి , ఏఏంసి చైర్మన్ జ్యోతి కృష్ణ , రాష్ట్ర సీనియర్ నాయకులు బక్కి వెంకటయ్య గారు రొట్టె రాజమౌళి , జిల్లా ఉపాధ్యక్షులు గుండెల్లిఎల్లారెడ్డి ,మండల పార్టీ అధ్యక్షులు బాణాల శ్రీనివాస్ , సర్పంచ్  స్వప్న స్వామి , వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Spread the love