గ్రామాభివృద్ధికి ఎల్లవేళల చల్మేడ అండగా ఉంటుంది

– చల్మేడ ఫీడ్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రావు
– తోటపల్లి గ్రామానికి వైకుంఠ వాహనమంధజేత
నవతెలంగాణ – బెజ్జంకి
తోటపల్లి గ్రామానికి ఎల్లవేళల చల్మేడ అండగా ఉంటుందని చల్మేడ ఫీడ్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రావు స్పష్టం చేశారు.గురువారం మండల పరిదిలోని తోటపల్లి గ్రామానికి వైకుంఠ వాహనాన్ని చల్మేడ ఫీడ్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రావు అందజేశారు.చల్మేడ సంస్థలు ప్రజల సమస్యలకు తమ చేయూతనందిస్తూ అండగా నిలుస్తుందని సర్పంచ్ బోయినిపల్లి నర్సింగరావు కోనియాడారు.అనంతరం తోటపల్లికి అండగా నిలుస్తున్న వెంటేశ్వర్ రావును సర్పంచ్ నర్సింగరావు శాలువా కప్పి సన్మానించారు. వార్డ్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.