బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానివి దొంగ హామీలు

– కాంగ్రెస్‌కు జై కొట్టిన గంజిపల్లి, బీఆర్‌ఎస్‌ నాయకులు
– డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి రామ్మోహన్‌ రెడ్డి
నవతెలంగాణ-దోమ
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానివి ఇచ్చిన దొంగ హామీలన్నీ, 10 ఏండ్లుగా కేసీఆర్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. దోమ మండల పరిధిలోని గంజిపల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ ఎస్‌ నాయకులు హరిసింగ్‌, బి.నరసింహులు, శ్రీను, శేఖర్‌, రమేష్‌, రాములు, కృష్ణయ్య, శ్రీనివాస్‌, పెంటయ్య, జనార్దన్‌ సింగ్‌, ఎల్లయ్య (వార్డ్‌ మెంబెర్‌ ), మాణిక్‌ సింగ్‌, బీరయ్య, రమేష్‌, చందర్‌సింగ్‌, జె.మల్లెష్‌, చంద్రయ్య, కార్యకర్తలు తదితరులు డీసీసీ అధ్యక్షులు కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ టి.రామ్మోహన్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర కాం గ్రెస్‌ పట్ల ప్రజలు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించని ముఖ్యమంత్రి, నిరుద్యోగ భృతి దళితులకు మూడెకరాల భూమి, కేజీ టు పీజీ ఉచిత విద్య అలాగే కనీస వసతులు లేని పాఠశాలలు వంటి ఎన్నో హామీలు నెరవేర్చకుండా పబ్బం గడుపుతున్న ఈ కేసీఆర్‌ ప్రభుత్వానికి ఈసారి సరైన బుద్ధి చెబుదామన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు మాలి.విజరు కుమార్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రసిడెంట్‌ శాంత్‌ కుమార్‌, ఎంపీటీసీ రాములు నాయక్‌, సీనియర్‌ నాయకులు రఘువేందర్‌ రెడ్డి, యాదయ్య గౌడ్‌, కావటి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love