ముఖ్యమంత్రి సభను విజయవంతం చెయ్యాలి

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్:
మండలంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం నాడు ఎంపీపీ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో మండల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో జుక్కల్ నియోజకవర్గంలో ని జుక్కల్ చౌరస్తా లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 30వ తేదీ నాడు ఎన్నికల ప్రచార సభ కోసం రానున్న సందర్భంగా మండలంలోని ప్రతి గ్రామం, తాండలు నుండి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అంతే కాకుండా  ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నాయకులు చెప్పే కల్లబోల్లి మాటలకు నమ్మవద్దని  ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి అందిస్తున్న ఘనత ఆయనకే దక్కిందని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి హన్మంత్ షిండే ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఆయన కార్యకర్తలకు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్ రెడ్డి,సొసైటీ ఛైర్మన్ హన్మంత్ రెడ్డి, మండల ఫోరమ్ సర్పంచ్ అధ్యక్షుడు తిర్మల్ రెడ్డి, మండలంలోని సర్పంచ్లు, ఎంపిటిసిలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love