సీఎం సోదరుడి ఓటు గల్లంతు..

 

నవతెలంగాణ – కోల్‌కతా: ఈ లోక్‌సభ ఎన్నికల వేళ.. పోలింగ్ కేంద్రానికి వెళ్లిన తర్వాత ఓటరు జాబితాలో పేరు లేకపోవడంతో పలువురు ఓటు వేయలేకపోయిన సందర్భాలు చాలా చూశాం. కానీ ఓ సీఎం సోదరుడికే అలాంటి పరిస్థితి ఎదురైంది. జాబితాలో పేరు గల్లంతు కావడంతో తన హక్కును వినియోగించుకోలేకపోయారని సమాచారం. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోదరుడు బబున్ బెనర్జీకి హావ్‌డా ప్రాంతంలో ఓటు ఉంది. ఐదోవిడతలో భాగంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఆయనకు తన ఓటు గల్లంతయిందన్న విషయం వెల్లడైంది. దీనిపై ఆయన్ను మీడియా ప్రశ్నించగా స్పందించేందుకు నిరాకరించారు. మరోవైపు ఈ వ్యవహారంపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. ‘‘ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. ఏం జరిగిందనే దానిపై అదే వివరణ ఇస్తుంది’’ అని తెలిపింది.

Spread the love