
నవతెలంగాణ న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. గురువారం ఉదయం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను ఆమె కలిశారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు సంబంధించిన అంశాలపైనే వారితో తాను చర్చించినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేసే దిశగా తాను నిరంతరం పనిచేస్తుంటానని షర్మిల చెప్పారు. కేసీఆర్‌కు కౌంట్‌డౌన్ మొదలైందని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఈ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.