ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో హర్షం వ్యక్తం చేసిన కలెక్టర్

– ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన అధికారులకు, జిల్లా ప్రజలకు సహకరించిన పాత్రికేయులకు అభినందనలు..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరగడం పట్ల జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మార్చి 16 నుండి మే 13వ తేదీ వరకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల నిర్వహణలో జిల్లా ప్రజల సహాయ సహకారాలు వారి భాగస్వామ్యం మరవలేనిదని ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరిని కలెక్టర్ అభినందించారు.ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం చాలా సంతోషకరమని పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిగినవి, ఎండలు తీవ్రంగా ఉన్నా కూడా ఎండను లెక్కచేయకుండా ఓటు హక్కు వినియోగించుకోవడంలో చైతన్యం చాటారని అందువల్ల గత పార్లమెంటు ఎన్నికల కంటే  అధికంగా పోలింగ్ నమోదు జరిగిందని. నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 1,91,945 పోల్ కాగా 76.34% శాతం ,కోదాడలో 1,84,415 పోల్ కాగా 75.21 శాతం, సూర్యాపేటలో 1,78,378 పోల్ కాగా 73.07 శాతం, తుంగతుర్తి లో 1,92,005 పోల్ కాగా 74.06% శాతం నమోదు అయ్యాయని, జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో పురుషులు 3,70,026 ,మహిళలు 3,76,686, ట్రాన్స్జెండర్స్ 31 ఓట్లు పోలయ్యాయని, జిల్లాలో మొత్తం 1,000,012 ఓటర్లకు గాను 7,46, 743 మొత్తం పోలైనట్లుగా 74.67% నమోదయిందని, తమ పూర్తి సహకారాన్ని అందించినందుకు పాత్రికేయులకు  సిబ్బందికి అభినందనలు తెలిపినట్లు కలెక్టర ఒక ప్రకటనలో తెలిపారు.
Spread the love