ట్రంప్‌ను కుదిపిన కోర్టు తీర్పు!

అమెరికా చరిత్రలో అధ్యక్షులుగా పనిచేసిన వారిలో అత్యంత హీన, చెత్త నేపథ్యం కలిగిన వాడిగా డోనాల్డ్‌ ట్రంప్‌ చరిత్ర కెక్కాడు. తాజాగా అలాంటిదే మరో ఘన తను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. దేశ అధికార కేంద్రంపై జరిపిన దాడిని తిరుగుబాటుగా పరిగణించిన కొలరాడో రాష్ట్ర కోర్టు రాజ్యాంగం ప్రకారం ఎన్నికలలో పోటీ చేసేందుకు ట్రంప్‌ అనర్హుడని తీర్పు ఇచ్చింది. ఇది ట్రంప్‌, అతగాడిని గుడ్డిగా సమర్ధించేవారికి పెద్ద కుదుపు అని చెప్పక తప్పదు. పన్నుల ఎగవేత, రికార్డుల తారు మారు మొదలు బూతుపురాణం వర కు అనేక కేసులు అతగాడి మీద ఉ న్నాయి. అన్నింటికీ మించి గత ఎన్ని కల్లో ఓటమిని జీర్ణించుకోలేక పార్ల మెంటు మీదనే తన అనుచరులను దాడికి పురికొల్పిన అంశం తెలిసిందే. అమెరికా రాజ్యాంగంలోని పద్నాలు గవ సవరణ మూడవ సెక్షన్‌ ప్రకారం శాసన వ్యవస్థ మీద తిరుగుబాటు చేసిన లేదా చేయించిన వారికి ఆ సంస్థలకు ఎన్నికయ్యే హక్కు లేదని పేర్కొన్నందున వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడని కొలరాడో కోర్టు 4-3 మెజారిటీతో తీర్పు ఇచ్చింది. వందల ఏండ్లుగా నాడు అమెరికా అంతర్యుద్ధంలో తిరుగుబాటు చేసిన వారిని అడ్డుకొనేందుకు తెచ్చిన సవరణను తొలిసారిగా వినియోగించింది.2021 జనవరి ఆరవ తేదీన అమెరికా అధికార కేంద్రం (పార్లమెంటు,అధ్యక్ష భవనాల ప్రాంతం) మీద ట్రంప్‌ దాడి చేయించిన సంగతి తెలిసిందే. ఒక రాష్ట్ర కోర్టుకు ఇలాంటి తీర్పు ఇచ్చే అధికారం లేదంటూ దేశ సుప్రీం కోర్టులో అప్పీలు చేసేందుకు ట్రంప్‌ బృందం నిర్ణయించింది.అక్కడ ఏం జరుగుతుందనేది చెప్పలేము. కొలరాడో కోర్టు ఇచ్చిన తీర్పు ప్రభావం నామమాత్రమే నని, అసలు సదరు సెక్షన్‌ అధ్యక్ష పదవికి వర్తిస్తుందా లేదా అన్నది కూడా అస్పష్టంగా ఉందని, దీంతో ఇంకా ట్రంప్‌కు మద్దతు పెరగవచ్చని కూడా చెబుతున్నవారు లేకపోలేదు. ఎందుకంటే ఇతర కేసుల్లో గతంలో అరె స్టయి విడుదలైనపుడు ఇరవై నాలుగు గంటల్లోనే అభి మానులు 40 లక్షల డాలర్ల విరాళాలు ఇచ్చి ప్రోత్స హించటాన్ని చూశాము.ఈ తీర్పు ప్రజాస్వామ్య గుండె మీదనే జరిగిన దాడిగా ట్రంప్‌ ప్రతినిధి అలీనా హబ్బా వర్ణించింది. సుప్రీం కోర్టులో ఎక్కువ మంది న్యాయమూ ర్తులను నియమించింది ట్రంపే గనుక వారికి ఉప్పుతిన్న విశ్వాసం ఉంటుందని భావిస్తు న్నారు. ఇదే గనుక జరిగితే అమె రికా న్యాయవ్యవస్థకు అది చెర గని మచ్చ అవుతుంది. అధి కార కేంద్రంపై జరిగిన దాడి తిరుగుబాటు పరిధిలోకి వస్తుందా రాదా అన్నది కూడా సుప్రీం కోర్టు తేల్చాల్సి ఉంది. కొలరాడో కోర్టు తీర్పును గుడ్డిగా పక్కన పెడు తుందా అన్నది ప్రశ్న. ట్రంప్‌ ఎన్నికల్లో పోటీని సవాలు చేస్తూ 25 రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి. ప్రస్తుతం జో బైడెన్‌ పలుకు బడి చాలా తక్కువగా ఉందని, ట్రంప్‌ ముందంజలో ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. రాజకీ యంగా చూసినపుడు అధికారం లేని కోర్టు తీర్పుకు బలైన ఒక బాధితుడిగా ఓటర్ల ముందుకు వస్తాడని కొందరు, పలుకుబడి దిగజారవచ్చని మరికొందరు అభి ప్రాయపడుతున్నారు. ఎన్నికల్లోపు మిగతా రాష్ట్రాల కోర్టుల్లో కూడా ఇదే విధ మైన తీర్పులు వస్తే సాంకే తికంగా ఎలాంటి ఇబ్బందులు కలిగిస్తాయో తెలియదు గానీ జనంలో చర్చకు దారితీసి గబ్బుపట్టవచ్చు. డోనాల్డ్‌ ట్రంప్‌ నిర్వాకం ఇప్పటికే అమెరికాను రాజ్యాంగ రొంపి లోకి దించింది. మరోవైపు తమ నేత ఏం చేసినా సరైనదే అనే అడ్డగోలు ధోరణులు పెరుగుతున్నాయి. రాజ్యాం గాన్ని కాపాడతానని ప్రమాణం చేసిన ట్రంప్‌ దాన్ని ఉల్లంఘించి అదే రాజ్యాంగం ప్రకారం గెలిచిన జోబైడెన్‌ ఎన్నికను అడ్డుకొనేందుకు చూడటం తిరుగుబాటు కిందకే వస్తుందని కొందరి భాష్యం. దీన్ని చూసీ చూడనట్లు వదలివేస్తే, ఎలాంటి శిక్ష విధిం చకపోతే మున్ముందు ఎవరైనా అలాంటి పను లకు పాల్పడవచ్చు. ఎక్కువసార్లు పార్టీలు మారి నవాడిగా, రెండుసార్లు అభిశంసనకు గురై, తొలిసారిగా అరెస్టుతో పేరుమోసిన పెద్దగా ట్రంప్‌ చరిత్రకెక్కాడు. నైతికంగా కూడా దిగ జారిన ఈ పెద్దమనిషిని తిరిగి గద్దె నెక్కిం చాలంటూ హౌడీ మోడీ పేరుతో అమెరికాలోని హూస్టన్‌ నగరంలో నిర్వహించిన కార్యక్రమం లో చెట్టపట్టాలు వేసుకొని కలియతిరిగిన నరేం ద్రమోడీ అబ్‌కీబార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని నినాద మిచ్చిన సంగతి తెలిసిందే. నీవెలాంటి వాడివో చెప్పాలంటే నీ స్నేహితుడిని చూస్తే చాలన్నది ఒక సామెత. ట్రంప్‌ పచ్చి మితవాది, అమెరికా లోని సంఘపరివార్‌ సంస్థ లకు చెందినవారు ట్రంప్‌ ప్రధాన మద్దతుదారులు, మోడీ-ట్రంప్‌లు ఇద్దరూ మిత వాద భావజాలాలకు చెందిన వారు కావటమే వారిని చెట్టపట్టాలు వేసుకు తిరిగేట్లు చేసింది. ఇప్పుడు కూడా మోడీ ట్రంప్‌ గెలవాలని కోరుకుంటారా ?

Spread the love