తల్లిదండ్రులను పెట్రోల్‌ పోసి హత్య చేసిన కొడుకు, కోడలు..

నవతెలంగాణ – హైదరాబాద్: మెదక్ లో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులను పెట్రోల్‌ పోసి హత్య చేశారు కొడుకు, కోడలు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నర్సాపూర్ లో డబుల్ మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. జల్సాలకు అలవాటుపడి తల్లి ఒంటిపై బంగా రం కోసం తల్లిదండ్రులను హతమార్చాడు కొడుకు. గత నెల 22న జరిగిన ఘటన… 25 రోజుల తర్వాత బయటపడింది. అటు అత్తమామల హత్యకు సహకరించింది కోడలు. ఇక నర్సాపూర్ రాయరావు చెరువు వద్ద జంట మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు సంగారెడ్డి జిల్లా హత్నూర (మం) సాదుళ్లనగర్ కి చెందిన కిష్టయ్య, నర్సమ్మగా గుర్తించారు. దుండిగల్ లో ప్రయివేటు ఉద్యోగం చేస్తున్నారు కిష్టయ్య, నర్సమ్మల కొడుకు లక్ష్మణ్. చెడు అలవాట్లకు బానిసై అప్పులపాలైన లక్ష్మణ్… అప్పులు తీర్చడానికి తల్లి మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారు చైన్ పై కన్నేశాడు. గత నెలలో తల్లిదండ్రులని ఇంటికి పిలిచిన కుమారుడు….ఇంట్లో తల్లిదండ్రులు నిద్రిస్తుండగా తల్లి గొంతునులిమి చంపాడు. కాసేపటికే తండ్రి నిద్రలేచి చూడటంతో తండ్రిని కూడా చంపేశాడు కిరాతకుడు. ఇక భార్య సహాయంతో కారులో నర్సాపూర్ అడవుల్లో మృతదేహాలను తీసుకువచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టి పరార్ అయింది ఈ జంట. ప్రస్తుతం వారిని అరెస్ట్‌ చేసినట్లు చెబుతున్నారు.

Spread the love