పంచాయితీ కార్మికుల డిమాండ్ వెంటనే పరిష్కరించాలి

– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్
– నిరసనకు మద్దతుగా బొల్లు దేవేందర్ 
నవతెలంగాణ -తాడ్వాయి
తెలంగాణ వ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికుల డిమాండ్లను బిఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిరవధిగా సమ్మె చేస్తున్న గ్రామపంచాయతీ సిబ్బందికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యల పరిష్కారం కొరకు చేస్తున్న సమ్మె రాష్ట్రవ్యాప్తంగా ఐదవ రోజుకు చేరుకుందని, అయినా కూడా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుందని బొల్లు దేవేందర్ మండిపడ్డారు. గ్రామపంచాయతీ కార్మికులు గ్రామాలను శుభ్రం చేసి ప్రజల ఆరోగ్యాలను కాపాడుతుంటే బిఆర్ఎస్ ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించకుండా వివక్షత ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 51 ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాకుండా కారు బార్ బిల్ కలెక్టర్లను సాయ కార్యదర్శులుగా నియమించాలని కోరారు. దీంతోపాటు గ్రామపంచాయతీలో ప్రతి ఉద్యోగి, కార్మికుడికి కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని ప్రభుత్వాన్ని మంచి చేశారు. ఈ కార్యక్రమంలో పూజార్ల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పిఎసిఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్ స్థానిక సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, సర్పంచులు కళ్యాణి నరసింహస్వామి మాజీ చైర్మన్ పాక సాంబయ్య, సింగిల్ విండో డైరెక్టర్లు యానాల సిద్దిరెడ్డి,  జగదీష్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love