నవతెలంగాణ – తాడ్వాయి: క్షణికావేశంలో ఎవరు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసు తెలిపారు.తాడ్వాయి మండలం డేవాయిపల్లి గ్రామంలో శనివారం రాత్రి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు ఎన్ని బాధలు ఉన్నా ఆ బాధలను అధిగమించడానికి కృషి చేయాలని కోరారు. కానీ ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మద్యం సేవించి ఎవరు వాహనాలు నడపవద్దన్నారు. సైబర్ నేరగాళ్లు అధికంగా ఉన్నారని, సైబర్ నేరాల నుంచి తమకు తామే కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి సిఐ శ్రీనివాస్, తాడువాయి ఎస్ఐ ఆంజనేయులు, గాంధారి, సదాశివ నగర్ ఎస్సైలు సుధాకర్ ,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.