ప్రెసిడెన్సీ పాఠశాలలో ‘సేవా’ కార్యక్రమం,ముఖ్య అతిథిగా పాల్గొన్న డిఇఓ..

నవతెలంగాణ-మోపాల్ : మోపాల్ మండల కేంద్రంలో గల ప్రెసిడెన్సి ఉన్నత పాఠశాలలో శనివారం రోజున సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ దుర్గాప్రసాద్ మరియు పాఠశాల చైర్మన్ శ్రీమంత రెడ్డి, పాల్గొన్నారు, డి ఈ ఓ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నప్పటి నుండి సేవా తాత్పర్యం అలవర్చుకోవడం గొప్ప విషయం అని, ఇందుకు కృషి చేసిన పాఠశాల యాజమాన్యానికి  మరియు విద్యార్థులకు ఆయన అభినందించారు. ఈ సేవా తాత్పర్యం వల్ల ఎంతోమంది పిల్లలకి భోజన రూపం లో కానీ వస్తురూపేనా కానీ పేద విద్యార్థులకు  సేవలు అందించడం చాలా గొప్ప విషయమని ,అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని చిన్నప్పటినుండి ఇటువంటి సేవా తాత్పర్యం అలవాటు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఆరవ తరగతి మరియు ఏడో తరగతి విద్యార్థులు వారి ఇంటి వద్ద నుండి తయారుచేసిన నాణ్యమైన ఆహారాన్ని, మరియు పిల్లలకు ఇష్టపూర్వకమైన పిండి వంటలు, పళ్ళు, తీసుకువచ్చి మోపాల్ మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకి ఇవ్వడం చాలా సంతోషకరం. అందులో చదువుకునే పిల్లలలో కొందరు నిరుపేదలు ఉండడం వల్ల వారికి సరియైనటువంటి రుచికరమైన ఆహార పదార్థాలు తినటానికి ఉండవు, అటువంటి వారి కోసం ఇటువంటి సేవా తాత్పర్యం ఉన్న, పిల్లలందరూ అందించడం గొప్ప విషయం అని తెలిపారు, ఇలాంటి కార్యక్రమాన్ని మిగతా పాఠశాలలు కూడా ఆదర్శంగా తీసుకొని పేదరికంలో ఉన్న పిల్లలకు తోడ్పాటు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు శ్రీ పవన్ కుమార్, డిన్ అధికారి మహేష్, ఉపాధ్యాయ బృందం మరియు వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love