Sunday, May 31, 2026
E-PAPER
Homeజాతీయందేశ విద్యావ్యవస్థ నాశనం

దేశ విద్యావ్యవస్థ నాశనం

- Advertisement -

విశ్వగురువు అని 
ఉత్త ప్రగల్భాలే
ఒక్క పరీక్ష కూడా సరిగ్గా నిర్వహించలే
ప్రధాని మోడీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు
దేశంలో మాఫియా చేతుల్లోకి విద్యావ్యవస్థ .. కేజ్రీవాల్ ఘాటు వ్యాఖ్యలు


న్యూఢిల్లీ : దేశ విద్యావ్యవస్థను ప్రధాని మోడీ పూర్తిగా నాశనం చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఒకవైపు దేశాన్ని విశ్వగురువుగా చెప్పుకుంటున్న మోడీ సర్కార్, ఒక్క పరీక్షను కూడా సరిగ్గా నిర్వహించలేకపోతోందని ఆరోపించారు. అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం శనివారం భారతదేశ వ్యాప్తంగా ‘సీయూఈటీ-యూజీ 2026 పరీక్ష’ నిర్వహించారు. అయితే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కొన్ని కేంద్రాల్లో పరీక్ష ఆలస్యమైందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీని ఉద్దేశించి రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. “నీట్, సీబీఎస్ఈ, ఎస్ఎస్సీ, నేడు సీయూఈటీ. మొత్తం నాలుగు పరీక్షలు, ఒక కోటి మంది విద్యార్థులు. ఒక్క పరీక్షను కూడా నిజాయితీగా నిర్వహించలేకపోయారు. తాము విశ్వగురువు అని ప్రగల్భాలు పలుకుతున్నారు. మొత్తం విద్యావ్యవస్థను పూర్తిగా నాశనం చేశారు. అయితే మీరు ఏ తరం భవిష్యత్తునైతే పాడు చేశారో, అదే తరం మిమ్మల్ని నిలదీస్తుంది. జవాబుదారీలను చేస్తుంది.” అని రాహుల్ అన్నారు.

దేశానికి ఒక చదువుకున్న ప్రధాని కావాలి: కేజ్రీవాల్
నీట్ పేపర్ లీక్ కావడంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శనివారం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేశ విద్యావ్యవస్థ మాఫియా గుప్పె ట్లోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. నీట్ ‌ప్రశ్నాపత్రాలను పరీక్ష‍ా కేంద్రాలకు తీసుకెళ్లేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సహాయం తీసుకోనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. నీట్ పేపర్ లీక్‌ కారణాలు తెలుసుకునే ఉద్దేశం కేంద్రానికి లేదని, దానికి బదులుగా ఇలాంటి వింతైన పనులకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. అయితే దీనిని సరిదిద్దడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి ఏదో ఒకటి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక్కరుగా ఎవరూ ఏమీ చేయలేరని, అందరూ కలిస్తే ఏదైనా సాధ్యమేనని ఆయన అన్నారు. అదే సమయంలో దేశానికి చదువుకున్న ప్రధానమంత్రి అవసరం ఎంతైనా ఉందని, మోడీపై తనదైన స్టైల్లో సెటైర్ వేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -