Sunday, May 31, 2026
E-PAPER
Homeజాతీయంప్రపంచంలోనే అత్యంత కచ్చితమైన 
ఓటర్ల జాబితాలో సర్ ఒకటి

ప్రపంచంలోనే అత్యంత కచ్చితమైన 
ఓటర్ల జాబితాలో సర్ ఒకటి

- Advertisement -

సీఈసీ జ్ఞానేశ్ కుమార్
ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో కీలక వ్యాఖ్యలు


న్యూఢిల్లీ : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)పై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న వేళ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స ర్ ప్రపంచంలోనే అత్యంత కచ్చితమైన ఓటర్ల జాబితాల్లో ఒకటని అభిప్రాయపడ్డారు. రేయింబవళ్లు ప్రతికూల ఒత్తిళ్లు ఎదురవుతున్నప్పటికీ పూర్తి పారదర్శకతతో ఓటర్ల జాబితాలను సిద్ధం చేస్తున్నందుకు ఎన్నికల అధికారులను ప్రశంసించారు. ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘‘15 లక్షలకు పైగా బూత్ స్థాయి ఏజెంట్లు, అన్ని జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీల జిల్లా, రాష్ట్ర అధ్యక్షుల పర్యవేక్షణలో 11 లక్షలకు పైగా బూత్ స్థాయి అధికారులు, అసిస్టెంట్ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు, ఎన్నికల రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ఈ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను రూపొందిస్తున్నారు. ఈ సర్ ప్రక్రియలో పాల్గొన్న వారందరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. వారందరూ ప్రపంచంలోనే అత్యంత కచ్చితమైన ఓటర్ల జాబితాల్లో ఒక దానిని తయారుచేయడానికి ఎన్నికల సంఘానికి డిప్యూటేషన్‌పై వచ్చారు. సీఈసీతో కలిసి పనిచేస్తున్న దేశంలోని ప్రముఖ న్యాయవాదులందరికీ, అలాగే 11 లక్షల బూత్ స్థాయి అధికారులు, 15 లక్షల బూత్ స్థాయి ఏజెంట్లకు వందనాలు” అని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -