ఢిల్లీని క‌మ్మేసిన దుమ్ము…

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఇవాళ ఉద‌యం బ‌ల‌మైన గాలులు వీచాయి. దీంతో విప‌రీతంగా దుమ్ము లేచింది. ఆ కార‌ణంగా అక్క‌డి గాలి నాణ్య‌త దారుణంగా ప‌డిపోయింది. విజిబులిటీ వెయ్యి మీట‌ర్ల లోపే త‌గ్గిన‌ట్లు ఐఎండీ తెలిపింది. గ‌త అయిదు రోజుల నుంచి ఉత్త‌రాదిలో ఎండ‌లు దంచికొడుతున్నాయి. దీంతో అక్క‌డ వాతావ‌ర‌ణం దుమ్ము దుమ్ముగా మారిపోయింది. 35 కిలోమీట‌ర్ల వేగంతో గాలి వీస్తున్న కార‌ణంగా ఎక్కువ దుమ్ము లేస్తోంద‌ని, పీఎం10 కాన్‌సెంట్రేష‌న్ స్థాయి 140 మైక్రోగ్రామ్స్ నుంచి 775 మైక్రోగ్రామ్స్ పెరిగింద‌ని, బ‌ల‌మైన గాలుల వ‌ల్లే దుమ్ము వ్యాపిస్తోంద‌ని, అయితే అది త్వ‌ర‌లోనే సెటిల్ అవుతుంద‌ని ఐంఎడీ అధికారి వీకే సోని తెలిపారు. గ‌త నాలుగు రోజుల నుంచి ఢిల్లీలో ఉష్ణోగ్ర‌త‌లు 40 డిగ్రీలు దాటుతోంది. ఇవాళ సాయంత్రం వ‌ర‌కు స్వ‌ల్పంగా మేఘాలు ఏర్ప‌డ‌నున్నాయని, కొన్ని చోట్ల జ‌ల్లుల వ‌ల్ల కూడా రిలీఫ్ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఐఎండీ తెలిపింది.

 

Spread the love