
– సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్య రావ్ సూర్యవంశీ
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. ఆదివారం స్థానిక సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో ఏర్పాటు చేసిన నల్గొండ పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలోని సూర్యాపేట అసెంబ్లీ సెగ్మెంట్ డిట్రిబ్యూషన్ సెంటర్ ను సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మణిక్యరావు సూర్యవంశీ , యస్.పి రాహుల్ హెగ్డే లతో కలసి కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నియోజక వర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన డిట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఆయా పరిధిలో గల పోలింగ్ కేంద్రాలకు రూట్ ల వారీగా పోలింగ్ సిబ్బంది, ఈవిఎమ్స్ సెక్టార్ అధికారి పర్యవేక్షణ లో పోలీస్ బందోబస్తుతో వాహనాలను తరలించామని కలెక్టర్ తెలిపారు. అదేవిదంగా జిల్లాలో ఏర్పాటు చేసిన 112 రూట్లలో 1201 పోలింగ్ కేంద్రాలకు ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలో 10,000,12 మంది ఓటర్లు ఉన్నారని, 123 సెక్టార్ అధికారులు, 5600 మంది పోలింగ్ అధికారులు అలాగే 173 మంది మైక్రో అబ్జర్వర్లు,వాలంటరీలు 729 మంది, అంగవైకల్యం ఉన్న వారికై 729 ఆటోలు ఏర్పాటు చేశామని తెలిపారు.

జిల్లాలో 48 ఆదర్శ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు..
జిల్లాలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రతి నియోజక వర్గంలో ఐదు ఆదర్శ మహిళ పోలింగ్ కేంద్రాలు, ఒక్క ఆదర్శ వికలాంగుల పోలింగ్ కేంద్రం, ఒక ఆదర్శ యూత్ పోలింగ్ కేంద్రం అలాగే ఐదు ఆదర్శ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఇట్టి పోలింగ్ కేంద్రాలను ఓటర్లు తప్పక వినియోగించుకొని ఓటింగ్ శాతం పెంచి ఇతర పోలింగ్ కేంద్రాలకు ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.