ఇండ్లపై ఉన్న కరెంటు వైర్లు తొలగించాలి

– చీదేడ్‌ సర్పంచ్‌ బైరిక రమాకాంత్‌ రెడ్డి
– త్వరలోనే తొలగిస్తాం
– విద్యుత్‌ ఏఈ సత్యనారాయణ
నవతెలంగాణ-మంచాల
గ్రామంలో ఇండ్లపై ఉ న్న కరెంటు వైర్లను వెం టనే తొలగించాలని చీదేడ్‌ సర్పం చ్‌ బైరిక రమాకాంత్‌ రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని చీదేడ్‌ సర్పంచ్‌ బైరిక రమాకాంత్‌ రెడ్డి ఆహ్వానం మేరకు విద్యుత్‌ ఏఈ సత్యనారా యణలు విద్యుత్‌ సమస్యలను పరిశీ లించారు. ఈ సం దర్భంగా ఆయన మీడియాతో మాట్లా డుతూ..గ్రామంలో కొన్నేం డ్లుగా నెలకొన్న విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి విద్యుత్‌ ఏఈని ఆహ్వా నించారని తెలిపారు. ఇండ్లపై కరెంటు వైర్లు ఉండటం, ఇండ్ల మధ్య ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు ఉండటం గతంలో వేసిన స్తంభాలకు వైర్లు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ సమస్యలను పరి ష్కరించాలని విద్యుత్‌ ఏఈని ఆహ్వానించారని అందకు ఏఈ సానుకూలం గా స్పందించారని తెలిపారు. విద్యుత్‌ ఏఈ సత్యనారాయణ మాట్లాడు తూ..గ్రామంలో ఉన్న విద్యుత్‌ సమస్యలను పరిశీలించారని త్వరలోనే సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ విద్యుత్‌ సిబ్బంది కావేటి అశోక్‌, గ్రామ యువకులు పందుగుల గణేష్‌, గి న్నె మహేందర్‌ తదితరులు ఉన్నారు.

Spread the love