వెంకటస్వామికి తుది వీడ్కోలు కెల్లంపల్లిలో ముసిగిన అంత్యక్రియలు

వెంకటస్వామికి తుది వీడ్కోలు
కెల్లంపల్లిలో ముసిగిన అంత్యక్రియలుమర్రిపూడి (ప్రకాశం జిల్లా) : సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తండ్రి వంకాయలపాటి వెంకటస్వామి అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన ప్రకాశం జిల్లా కెల్లంపల్లిలో ఆదివారం ఉదయం జరిగాయి. హైదరాబాద్‌లో వెంకటస్వామి మృతి చెరదడంతో ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వరరావు, సిహెచ్‌.బాబూరావు, డి.రమాదేవి, కె.సుబ్బరావమ్మ, అండ్ర మాల్యాద్రి, జె.జయరాం, ప్రజాశక్తి ఎడిటర్‌ తులసీదాస్‌ తదితరులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్ర సాగింది. గ్రామ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
నాన్నకు ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం ఎక్కువ : వి శ్రీనివాసరావు
సంతాప సభలో వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ తన తండ్రి ఎంతో ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానంతో ఉండేవారంటూ గుర్తు చేసుకున్నారు. ముసలితనంలో ఉన్నా కర్ర ఊతంతో నడవడానికి నిరాకరించేవారని తెలిపారు. స్త్రీలను గౌరవించేవారని, ఆడపిల్లల పట్ల ఎంతో ఆప్యాయంగా ఉండేవారని గుర్తు చేశారు. చివరి వరకూ తన కాళ్లపైనే తనపని తాను చేసుకోవాలనే పట్టుదలతో ఉండేవాడని తెలిపారు.

Spread the love