మొదటి బడి అంగన్‌వాడీ

The first school is Anganwadi– శుభ ప్రద్‌ పటేల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ సభ్యులు శ్రీశైలం
– శుభప్రద్‌ పటేల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ సభ్యుల ఆధ్వర్యంలో అంగన్‌వాడీ టీచర్లకు ఘనంగా సన్మానం
నవతెలంగాణ-తాండూరు
విద్యార్థులకు మొదటి బడి అంగన్‌వాడీ కేంద్ర మని, శుభ ప్రద్‌ పటేల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ సభ్యులు శ్రీశైలం అన్నారు. తాండూరు పట్టణంలో మంగళవా రం శుభప్రద్‌ పటేల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లను శుభ ప్రద్‌ పటేల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ సభ్యు లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ట్రస్ట్‌ సభ్యులు శ్రీశైలం మాట్లాడుతూ..నేటి సమాజంలో విద్యార్థులకు మొదటి బడి అంగన్‌వాడి కేంద్రమని, శిశువులకు అ, ఆ, ఇ, ఈ, లు మొదటి పలుకులు నేర్పుతున్నటువంటి అంగన్‌వాడీ టీచర్లకు సన్మా నించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా అంగన్‌వాడీ టీచర్‌ విజయమాల మాట్లా డుతూ..22 సంవత్సరాల నుండి శిశువులకు ఎంతో సేవ చేస్తున్న ‘మాకు ఈ రోజు ఉపా ధ్యాయ దినోత్సవ సందర్భంగా మమ్మల్ని గుర్తించి ఈ సన్మానం చేసినందుకు శుభ ప్రద్‌ పటేల్‌ చారి టబుల్‌ ట్రస్ట్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు’ తెలిపారు. నాగలక్ష్మి టీచర్‌ మాట్లాడుతూ..ఈ సమాజంలో ఇప్పటివరకు ‘మాకు ఎవరు కూడా గుర్తించలేదు కానీ ఎన్‌ఎస్పి ట్రస్ట్‌ సభ్యులు మమ్ములను గుర్తించి, మేము చేసిన సేవలకు గాను మాకు సన్మానించడం మా అదష్టంగా భావిస్తున్నాము’ అని తెలిపారు. కార్యక్రమంలో తాండూరు పట్టణంలోని అంగన్‌ వాడి టీచర్లు, మాజీ సర్పంచ్‌ లక్కాకుల నిర్మలా, శుభప్రద్‌ పటేల్‌ యువసేన సభ్యులు భాను, బాలు, నరేష్‌ గౌడ్‌, విజరు కుమార్‌, అల్లాపూర్‌ నరేష్‌ గౌడ్‌, మనోహర్‌, సాయికుమార్‌, చావుస్‌, హరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love