Sunday, May 10, 2026
E-PAPER
Homeజాతీయంకేరళంలో 'కుర్చీల ఆట' హాస్యాస్పదం

కేరళంలో ‘కుర్చీల ఆట’ హాస్యాస్పదం

- Advertisement -

సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యురాలు కేకే శైలజ
తిరువనంతపురం : కేరళంలో ముఖ్యమంత్రి పదవి విషయంలో కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అంతర్గత విభేదాలపై సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యురాలు కేకే శైలజ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్న కాంగ్రెస్‌ ”కుర్చీల ఆట” పూర్తిగా హాస్యాస్పదమని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేరకు కేకే ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ముఖ్యమంత్రి పదవిపైనే ఇంత పెద్ద వివాదం ఉంటే భవిష్యత్తులో ప్రభుత్వం కీలక అంశాలపై ఎలా సరైన నిర్ణయాలు తీసుకోగలదని ఆమె ప్రశ్నించారు. యూడీఎఫ్‌కు ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారని శైలజ పేర్కొన్నారు. అదే సమయంలో ఎల్‌డీఎఫ్‌ ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. అయితే, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ ఆలస్యం చేస్తే కేరళ తీవ్ర అనిశ్చితి, గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -