Sunday, May 10, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంసోవియట్‌ విజయస్ఫూర్తిని చాటాలి

సోవియట్‌ విజయస్ఫూర్తిని చాటాలి

- Advertisement -

లక్షలాది మంది మరణాలకు నాజీలే కారణం
ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం దురాక్రమణ శక్తితో పోరాడుతుంది : 81వ వార్షికోత్సవంలో అధ్యక్షుడు పుతిన్‌ వ్యాఖ్యలు

మాస్కో : రెండో ప్రపంచయుద్ధం (1941-1945)లో సోవియట్‌ యూనియన్‌ సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ రష్యా 81వ వార్షి కోత్సవాన్ని శనివారం రెడ్‌స్కేర్‌లో ఘనంగా నిర్వహించింది. యుద్ధంలో మరణించిన సైనికులు, ప్రజలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉత్తర కొరియా సైనిక కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రసంగిస్తూ ప్రతినిధులు, మహిళలు, ప్రముఖులు, స్నేహితులమై విజయ దినోత్సవం సందర్భంగా స్వాగతిం చడం ఆనందంగా ఉందన్నారు. సోవియట్‌ ప్రజల వీరత్వాన్ని, నాజీ యిజాన్ని మట్టికరిపించిన పోరాట కషిని మనం ఎల్లప్పుడూ గుర్తుంచు కోవాలన్నారు. నాజీ జర్మనీకి దుర్మార్గా లకు బలైపోయిన దేశాలకు సోవియట్‌ యూనియన్‌ సార్వభౌమాధికారాన్ని పునరుద్ధరించిందని పుతిన్‌ గుర్తుచే శారు. నాజీలు సోవియట్‌ యూని యన్‌పై ద్రోహపూరితంగా దాడి చేశారని, దేశాన్ని, అపారమైన వనరు లను స్వాధీనం చేసుకోవాలని, సంస్క తిని, చారిత్రక వారసత్వాన్ని పూర్తిగా నాశనం చేయాలని, అంతిమంగా సోవియట్‌ యూనియన్‌లోని ప్రజలు, జాతులు, జాతి సమూహాలతో సహా మొత్తం సోవియట్‌ ప్రజలను నిర్మూ లించి, బానిసలుగా చేయాలని నాజీ లు ప్రణాళిక వేశారన్నారు. ఇందు కోసం ఐరోపా నలుమూలల నుంచి బలగాలను సమీకరించారని, నాజీ వ్యూహకర్తలు పక్కా ప్రణాలిక రూపొం దించారన్నారు. కానీ ఒక్క విషయాన్ని లెక్కలోకి తీసుకోలేదని, అదే రష్యన్ల స్వభావం, సోవియట్‌ ప్రజల ఆత్మశక్తి అని పుతిన్‌ వివరించారు. ఈ ఏడాది తో నాజీలు దాడి చేసి 85 ఏండ్లు పూర్తవుతుందన్నారు. మాతభూమి రక్షణ కోసం లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని, తమ సొంత ఆధి పత్యం, జాతి వివక్షత, జెనోఫోబియా, ప్రజలను అణచివేయడం వంటి భయంకరమైన పరిణామాలను ఈ రోజు గుర్తుచేస్తుందన్నారు. అయితే ప్రపంచ వ్యవస్థలను, ఐక్యరాజ్య సమితి నిబంధనలను పాటించాలని పుతిన్‌ పిలుపునిచ్చారు. ప్రపంచ ప్రజల సాంస్కతిక, నాగరిక వైవిధ్యా న్ని, శాంతిని కాపాడాలన్నారు. రెండో ప్రపంచ యుద్ధ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను, నాజీల దుర్మార్గాలను కీర్తించే ప్రయత్నాలను గట్టిగా ఎదుర్కో వడం చాలా ముఖ్యమని ఈ సందర్భం గా తెలిపారు. సోవియట్‌ పౌరులపై నాజీల మారణహోమం, అకత్యాలను సమర్థించడాన్ని నిరోధించాలని పరో క్షంగా అమెరికా, ఉక్రెయిన్‌లను ఉద్దే శించి పుతిన్‌ వ్యాఖ్యానించారు. ఉక్రె యిన్‌లోని రష్యా సైనికులు నాటో దేశాలన్నింటి మద్దతు ఉన్నదురాక్ర మణ శక్తితో పోరాడుతున్నారని, తన యుద్ధ లక్ష్యాలు న్యాయమైనవి అని తెలిపారు. చివరగా, పుతిన్‌ విజేతల తరానికి, సత్యం, న్యాయం విజయానికి, దేశాలు, ప్రజల స్నేహం, శ్రేయస్సుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంక్షలు ఉన్నప్పటికీ, యూరప్‌ అంతటా ప్రజలు సోవియట్‌ యుద్ధ స్మారక చిహ్నాల వద్ద నివాళులర్పించారు. యుద్ధంలో నాజీలతో పోరాడిన బంధువుల చిత్రాలను ప్రదర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -