నిరుపేదల అభివృద్ధే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యం

– జడ్పీటీసీ ధారాసింగ్‌
– కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఒక్కరికీ అందజేసేందుకు కృషి చేస్తాం
– ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి సహకారంతో చికిత్స పొందుతున్న మహ్మద్‌ అలీకి రూ.7 లక్షల ఎన్‌ఓసీ అందజేత
నవతెలంగాణ-పెద్దేముల్‌
నిరుపేదల అభివృద్ధే కాంగ్రెస్‌ ప్రభుత్వం లక్ష్యంగా ముందుకు సాగుతామని రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రధాన కార్య దర్శి పెద్దేముల్‌ జడ్పీటీసీ ధారాసింగ్‌ కొనియాడారు. మంగళవారం మండల కేంద్రంలో గ్రామానికి చెందిన మ మ్మద్‌ అలీ ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి సహకారంతో రూ.7 లక్షల ఎన్‌ఓసీని జడ్పీటీసీ ధారాసింగ్‌, జిల్లా మహి ళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు శోభారాణి, జిల్లా ఉపాధ్యక్షులు న్యాయవాది ఎల్లారెడ్డి, రాష్ట్ర మైనారిటీ సెల్‌ కన్వీనర్‌ రియాజ్‌, మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పెండాల ప్రవీణ్‌ కుమార్‌ గుప్తా, తాండూర్‌ మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ జితేందర్‌ రెడ్డి, మాజీ ఎంపీటీసీ డాక్టర్‌ రమేష్‌ కుమార్‌ బాధితుని కుటుంబ సభ్యులకు చెక్కు అందజేశా రు. వారు మాట్లాడుతూ…కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టి న సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికీ అందేవిధంగా కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకా లను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ బాలప్ప, వార్డు సభ్యులు డివై అరవింద్‌, మల్లేశం, మండల బీసీ సెల్‌ ఉపాధ్యక్షులు ఆనందచారి, మండల మైనార్టీ కన్వీనర్‌ షబ్బీర్‌, గ్రామ కమిటీ అధ్యక్షులు డివై నర్సింలు, సీనియర్‌ నాయకులు రవిశంకర్‌, ముజీబ్‌, సాయిలు, అంజి, చందు తదితరులు పాల్గొన్నారు.

Spread the love