
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
తెలంగాణ సంక్షిప్త పదాన్ని టిఎస్ బదులుగా టీజీ గా మార్చాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జండగే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్ లలో టీజీగా గా ఉండాలని, ప్రభుత్వ శాఖలు, సంస్థలు, అటానమస్ విభాగాలన్నీ దీనిని పాటించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని అధికారిక వ్యవహారాలకు వర్తింపజేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఇది తక్షణమే అమల్లోకి వచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటికీ ఇది వర్తిస్తుందన్నారు. వెబ్‌సైట్లతో పాటు అన్ని రకాల ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు, ఆన్లైన్ ప్లాట్ ఫామ్ లలో, రిపోర్టుల్లో ఇకపైన ‘టీజీ’ పదాన్నే (అబ్రివేషన్) వినియోగించాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ‘టీజీ’ అనే అబ్రివేషన్‌ను అధికారికంగా గుర్తించడంతో ఈ మార్పును అన్ని విభాగాలూ అమల్లోకి తెచ్చేలా ఆయా డిపార్టెమెంట్ల కార్యదర్శులు, హెచ్ఓడీలు పర్యవేక్షించాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారని, ఈ సందర్భంగా ఆన్ని కార్యాలయాల్లో టీఎస్ కు బదులుగా టీజీ గా మార్చి ఈనెల 26 వ తేదీ లోగా నివేదికలు సమర్పించాలని శాఖల అధికారులను ఆదేశించారు.