బీసీ కులాలకు లక్ష రూపాయల రుణాన్ని ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, అందుకు అనుగుణంగా కుల దృవీకరణ పత్రం, ఆదాయపత్రం, జారీ చేయడంలో రాష్ట్రవ్యాప్తంగా తహసిల్దార్ కార్యాలయ అధికారులు పూర్తిగా విఫలం అయ్యారు సిపిఎం జిల్లా కార్యదర్శి వరిగ సభ్యులు మల్యాల గోవర్ధన్ మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేస్తూ ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాలకు లక్ష రూపాయల రుణాన్ని ఇస్తామని ప్రకటించడం అభినందనీయం అని అన్నారు కానీ అదే సమయంలో బీసీ కులాలలో ఎంతమంది ఉన్నారు, అనేది చూసుకోవాలని దీనివలన సర్టిఫికెట్ల కోసం ఎమ్మార్వోల చుట్టూ తిరుగుతున్నామని నానా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం గుర్తించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకోవడానికి కోసం తేదీలను పొడిగించాలని, కులం ఆదాయం పత్రాలు జారీ చేయడంలో సాంకేతిక లోపాలు తలెత్తకుండా చూడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్యాల గోవర్ధన్ డిమాండ్ చేశారు.
బీసీ కులాలకు లక్ష రూపాయల రుణాన్ని ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం విఫలం
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్యాల గోవర్ధన్
నవతెలంగాణ కంటేశ్వర్