Tuesday, May 26, 2026
E-PAPER
Homeనల్లగొండపది రోజుల్లో కల్లాలలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తిచేయాలి

పది రోజుల్లో కల్లాలలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తిచేయాలి

- Advertisement -
  • ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నవతెలంగాణ-మునుగోడు: పది రోజుల్లో కల్లాలలో దాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తిచేయాలి అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాలను జారీ చేశారు.మంగళవారం మునుగోడులోని అదికారిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నల్గొండ, యాదాద్రి జిల్లాల అదికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఏసంగి పంట దాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఎలా కొనసాగుతోంది, ప్రస్తుతం ఏఏ మండలాలలో ఎంత దాన్యం కొనుగోలు చేశాం, కల్లాలలో ఎంత దాన్యం ఉంది, దిగుబడికి తగిన నిలువ సామర్థ్యం ఆయా మండలాలలో ఉందా లేదా..? నిలువ సామర్థ్యం లేని మండలాలకకు చెందిన దాన్యం ఎటు తరలిస్తున్నారు, హమాలీల కొరత, లారీల కొరత ఎంత మేరకు ఉంది కొనుగోల్లు వేగవంతం చేయడానికి క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలకు తాత్కాలిక పరిష్కార మార్గాలు శాశ్వత పరిష్కారాల మార్ల్గ్గాలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.నల్గొండ జిల్లా పరిదిలోని మునుగోడు, చండూరు, ఘట్టుప్పల్, నాంపల్లి, మర్రిగూడ మండలాలలో గత సంవత్సరంలో మొత్తం 2,85,560 క్వింటాళ్ల సేకరణ జరగగా, ఈ సంవత్సరం 4,20,430 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది అని తెలిపారు. ఇప్పటికే 3,52,300 క్వింటాళ్ల దాన్యం కొనుగోళ్లు జరగగా ఇంకా కల్లాలలో 68130 క్వింటాళ్ల దాన్యం ఉన్నది. యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్, నారాయణ్ పూర్ మండలాలలో గత సంవత్సరం కంటే ఈసారి రెండింతలు ఎక్కువ దిగుబడి వచ్చింది , ఇప్పటివరకు 2,36,215 క్వింటాళ్లు సేకరించగా ఇంకా సేకరించాల్సి ఉంది అనుకున్న దానికంటే ఎక్కువ రెట్లు దాన్యం దిగుబడి పెరగడానికి తోడు హమాలీలు, లారీల కొరతతో పాటు ఈ ప్రాంతంలోని కొన్ని మిల్లులు బ్లాక్ లిస్టులో ఉండడం, నిలువ సామర్థ్యం ఉన్న గోదాములు లేకపోవడంతో కొనుగోళ్లలో జాప్యం జరుతుందని అదికారులు గౌరవ ఎమ్మెల్యే ద్రుష్టికి తీసుకొచ్చారు.

హమాలీలలకు ప్రభుత్వం చెల్లించే కూలీకి అదనంగా ఇంకొంత తాను చెల్లిస్తానని అదికారులకు హామీ ఇచ్చిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి హమాలీలకు చెల్లించే 10,20,000 రూపాయలు తాను సొంతంగా చెల్లిస్తానని అదికారులకు హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి మండలంలో గోదాముల ను పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.. మునుగోడులో 2 లక్షలు, నాంపల్లి లో 1 లక్ష, నారాయణ్ పూర్ లో 2 లక్షలు, చౌటుప్పల్ లో 4 లక్షల క్వింటాళ్ల చొప్పున 9 లక్షల క్వింటాళ్ల దాన్యం నిలువ చేసే గోదాముల నిర్మాణాలకు అంచనాలు రూపొందించాలని అదికారులకు ఆదేశించారు. అదేవిదంగా ఇక్కడ పండిన దాన్యాన్ని ఇక్కడి గోదాముల్లోనే నిలువచేసుకునే విదంగా చూడాలన్నారు.భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు కులుగకుండా మండలం యూనిట్ గా తీసుకుని పంటలు దిగుబడిని అంచనా వేసి ముందస్తుగా చర్యలు తీసుకునే విదంగా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో నల్గొండ అడిషనల్ కలెక్టర్ రెవిన్యూ, శ్రీనివాస్, డీఆర్డీఓ నల్గొండ శేఖర్ రెడ్డి, చండూరు ఆర్డీవో శ్రీదేవి, చౌటుప్పల్ ఆర్టీఓ శేఖర్ రెడ్డి, యాదాద్రి డీసీఓ, నల్గొండ ఇన్ చార్జి డీసీఓ, సివిల్ సప్లై అదికారులు , అన్ని మండలాల ఎమ్మార్వొలు, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ అదికారులు, ఆయా మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -