Tuesday, May 26, 2026
E-PAPER
Homeనిజామాబాద్మున్నూరు కాపు నూతన కార్యవర్గం ఎన్నిక

మున్నూరు కాపు నూతన కార్యవర్గం ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్‌పల్లి: మండలంలోని కోనాపూర్ గ్రామ మున్నూరు కాపు (పటేల్ )సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మంగళవారం గ్రామంలోని మున్నూరుకాపు (పటేల్ )సంఘం భవనంలో సంఘ సభ్యుల వార్షిక సమావేశం నిర్వహించారు. పాత కార్యవర్గం కాలపరిమితి తీరినందున రాబోయే సంవత్సర కాలానికి గాను నూతన కార్యవర్గాన్ని సంఘ సభ్యుల ఆమోదం మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ మున్నూరు కాపు (పటేల్ ) సంఘం నూతన అధ్యక్షులుగా బొట్ల రమేష్, ప్రధాన కార్యదర్శిగా మంగి రవి లను సంఘ సభ్యుల ఏకగ్రీవ ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ సంఘ అభివృద్ధి కోసం తమవంతుగా పాటుపడతామన్నారు. సంఘ సభ్యుల సమస్యల పరిష్కారసం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులందరూ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -