- కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య
నవతెలంగాణ-మల్హర్‌రావు: మంథని పట్టణంలోని శివ కిరణ్ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ,మండల కమిటీ ఏర్పాటుపై సమీక్ష సమావేశాలు బుధవారం ఉదయం 10 గంటలకు నిర్వహించడం జరుగుతుందని,ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శీను బాబు హాజరుకానున్నట్లుగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మంథని నియోజక వర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు,మున్సిపల్ ప్రజా ప్రతినిధులు అన్ని మండలాల యూత్ అధ్యక్షులు,సింగిల్ విండో చైర్మన్ లు డైరెక్టర్లు,గ్రామ సర్పంచులు,గ్రామ శాఖ అధ్యక్షులు, అన్ని గ్రామాల యూత్ అధ్యక్షులు మండల మహిళా అధ్యక్షులు గ్రామాల మహిళా అధ్యక్షులు,బీసీ సిఎల్.ఎస్ సిఎల్ .ఎస్టి సిఎల్ అధ్యక్షులు,కాంగ్రెస్ నాయకులందరూ తప్పక సమయానికి హాజరు కావాలని కోరారు.



