- మండల వ్యవసాయాధికారి శ్రీజ
నవతెలంగాణ-మల్హర్ రావు: పొలాల్లో వరికోయలు కాల్చొద్దు..కలియ దున్నాలని మండల వ్యవసాయాధికారి శ్రీజ తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు గతంలో పశువులు ఎక్కువగా ఉండడంతో అన్నదా తలు వరి చేనులను కొడవళ్లతో మొదళ్ల దాకా కోసే వారు ప్రస్తుతం సాగు విధానంలో ఇదేక మార్పులు చోటుచేసుకున్నాయి. యంత్రాలను విరివిగా ఉపయోగించడంతో పశువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.దీంతో హార్వెస్టర్ ద్వారా వరి కోత పైకి కోయడం ద్వారా కొయ్యకాలు మిగిలిపోతున్నాయి. ఈ క్రమంలో పాలం దున్నే సమయంలో నాగళ్లకు తడుతున్నాయని రైతులు కొయ్యకాలు ను కాల్చివేస్తున్నారని తెలిపారు.
కాల్చితే అపార నష్టం..రైతులు వరికొయ్యలను కాల్చడం ద్వారా అపార నష్టం వాటిల్లుతుంది. భూసారం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదముంది. మంటల ద్వారా విపరీతమై వేడితో భూమి భూసా రాన్ని కోల్పోతుంది.ముఖ్యంగా నత్రజని, పాస్పరస్ లాంటి పోషక పదార్థాల శాతం తగ్గి దిగ్గుబడి తగ్గిపోతుంది భూమికి వీరు పదా ర్థంగా ఉపయోగపడే అవశేషాలు కాలిపో కాయి పంటలకు అవసరమైన ఖనిజలవనాలు దెబ్బతింటాయి. పొలాల్లో తిరిగే పా ములు, ముంగీసలు, ఉడుములు, నెమళ్లు, తొండలు ఇలా అనేక జీవరాశులు చనిపోయే ప్రమాదం అధికంగా ఉన్నది. ఒక్కోసారి గాలి మంటలు అధికంగా వ్యాపించి మనుషుల కోల్పోయిన ఘటనలున్నాయి. వ్యవసాయ సామగ్రి, పనిముట్లు ధ్వంసమైన సందర్భాలు సైతం ఉన్నాయన్నారు.
ఇలా చేస్తే అధిక ప్రయోజనాలు..కొయ్యకాలు నేలలో కలియదున్నడం వల్ల సేంద్రియ కర్బన శాతం పెరిగి దిగుబడులు 5 నుంచి 10శాతం పెరిగే అవకాశం ఉన్నది. దుక్కిదున్నే సమయంలో సింగిల్ సూపర్ పాస్పేట్(ఎస్ఎస్ పి) చల్లితే అవశేషాలు రెండు వారాల్లో మునిగి పోషకాలుగా మారుతాయి. ఫలితం గా టీఏపీ వాడకం సగం వరకు తగ్గుతుంది.మొక్కలకు 2శాతం నత్రజని (యూరియా) 4శాతం పాస్పరస్ అదనంగా అందిస్తుంది. జింక్, మాంగనీస్, ఇనుము, కాల్షియం లాంటి సూక్ష్మ ధాతువులు పంటకు మేలు చేకూర్చుతాయి. నీటినిల్వ సామర్థం పెరుగుతుందన్నారు.
అవగాహన కల్పిస్తున్నాం..వరి కొయ్యలను తగలబెట్టకుండా భూమిలో కలియ దున్నడం ద్వారా సేంద్రియ ఎరువుగా ఉపయోగపడు తుంది. వరికొయ్య కాలుకు నిప్పుపెట్టడం ద్వారా గాలి, నేల కలుషితమవుతుంది. పంటలకు మేలు చేసే మిత్ర పురుగులు మరణి స్తాయి. దున్నే ముందు తప్పనిసరిగా సింగిల్ సూపర్ ఫాస్పేట్ చల్లితే కొయ్యలు గడ్డి త్వరగా కుళ్ళిపోతాయి. దీంతో ఎరువుగా మారి దిగు బడి కూడా పెరుగుతుంది. రసాయన ఎరువుల వాడకం పూర్తిగా తగ్గించ వచ్చు. ప్రతి క్లస్టర్ పరిధిలో వ్యవసాయ విస్తరణాధికారులు అవగాహన కల్పిస్తున్నారు రైతులు తమ సూచనలు పాటిస్తే తప్పకుండా మేలు జరుగుతుందన్నారు.



