గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి..

నవతెలంగాణ- రామారెడ్డి : గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి, చికిత్స పొందుతూ మహిళా మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జగదాంబ తండాకు చెందిన భూక్య మనీ (51)శనివారం సాయంత్రం మరిది ఇంటికి వెళ్లి వస్తుండగా, గుర్తు తెలియని వాహనం రామారెడ్డి నుండి అన్నారం వైపు వెళుతుండగా, ఆమెను వెనుక నుండి ఢీకొట్టడంతో తలకు, కాళ్లకు, శరీరంపై తీవ్ర గాయాలు అవడంతో, చికిత్స నిమిత్తం, ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించిందని, మృతురాలు కుమార్తె గంగావతి రైనా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు, ఏఎస్ఐ సుభాషిని తెలిపారు.
Spread the love