నిత్యం నాతో గొడవ పడని భర్త నాకొద్దు విడాకులు ఇప్పించండి..

నవతెలంగాణ – ఉత్తరప్రదేశ్‌: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ పెళ్లయిన 18 నెలలకే విడాకుల కోసం ఒ వింత కారణంతో కోర్టుకెక్కింది. సాధారణంగా ఈతరం యువతీయువకులు చిన్న చిన్న కారణాలే విడాకులు తీసుకుంటున్నారు. ఇక ఈ మహిళ విడిపోవడానికి చెప్పిన కారణం విని.. న్యాయమూర్తి సైతం షాక్ అయ్యాడు. భర్త తనను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని, తనతో అస్సలు గొడవ పడడం లేదని ఆ మహిళ విడాకులు కోరింది. విడాకులు కోరిన సదరు మహిళ.. తనతో తన భర్త చాలా మాట్లాడాలని, వాదించాలని, గొడవపడాలని కోరుకుందట. అయితే ఆమె ఎంత చెప్పినా కూడా భర్త తనపై కోపం తెచ్చుకోవట్లేదని పేర్కొంది. ఒక్కరోజు కూడా ఆమెతో గొడవ పడలేదట. దీంతో విసిగి వేసారిన ఆ మహిళ తన భర్త ప్రేమ తనను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని విడాకులు కోరింది. ‘నా భర్త చాలా మంచివాడు. అతను నా కోసం వంట చేస్తాడు. ఇంటి పనులన్నీ చేయడంలో సహాయం చేస్తాడు. నన్ను అస్సలు ఇబ్బంది పెట్టడు. చాలా బాగా చూసుకుంటారు.  మేము ఇతర జంటల వలె మాములుగా లేమనిపిస్తోంది. నా భర్త నాతో ప్రతి విషయంలో రాజీపడడం నాకు ఇష్టం లేదు’ అని కోర్టులో ఆ మహిళ చెప్పింది. ‘నేను తప్పు చేసినప్పుడు అతను ఎల్లప్పుడూ నన్ను క్షమించేవాడు. ఎప్పుడూ ఏదొక గిఫ్ట్ నకు తీసుకొచ్చి.. నన్ను ఆశ్చర్యపరుస్తాడు. నేను అతనితో వాదించాలనుకున్నాను. కానీ, ఒక్కరోజు కూడా నాతో అతడు వాదించలేదు, గొడవ కూడా పడలేదు’ అని ఆమె పేర్కొంది. తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని చెప్పింది. ఇక ఆమె వాదనలు విన్న జడ్జి.. విడాకుల పిటిషన్‌ను కొట్టిపారేశారు. ఇలాంటి నిరుపయోగమైన కారణాలకు విడాకులు మంజూరు చేయబోమని పేర్కొన్నారు. ‘మీ భర్తకు కూడా మీకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేదు. మీ సమస్యను మీరే పరిష్కరించుకోవాలి’ అని చెప్పారు.

Spread the love