మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం: కలెక్టర్

– పోలింగ్ కేంద్రాల్లో  నిబద్ధతతో పనిచేయాలి
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరగాలని ఆదిశగా మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు.శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ నెల 27 న  జరిగే శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్బంగా మైక్రో అబ్జర్వర్ల తో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంకతో కలసి పాల్గొన్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ రోజున మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని ఆదిశగా ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.పోలింగ్ రోజున చెక్ లిస్ట్ ప్రకారం ప్రతి అంశాన్ని పరిశీలించుకోవాలని అలాగే ఓటర్లు ఎక్కువగా ఎపిక్ కార్డులు వినియోగించుకునేలా చూడాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన 12 గుర్తింపు కార్డులు చూపి ఓటు హక్కు  సద్వినియోగం చేసుకునేల చూడాలని సూచించారు. జిల్లాలో 71 కేంద్రాలు ఏర్పాటు చేయగా వాటిలోని 22 కేంద్రాల్లో 800 మంది ఓటర్లు ఉన్నారని అట్టి చోట రెండు జంబో బాక్స్ లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అన్ని కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేపట్టనున్నట్లు సూచించారు.పోలింగ్ కేంద్రాల్లో జరిగే ప్రతి అంశాన్ని పి.ఓ డైరీలో  నమోదు అయ్యేలా చూడాలని అదేవిదంగా సీలింగ్ ప్రాసెస్ ను నిచితంగా పరిశీలన చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల కు 26న నియమించిన సిబ్బందితో కేంద్రాలకు వెళ్ళవలసి ఉంటుందని ,  ముఖ్యంగా ఎన్నికల్లో నియమించిన అధికారులు సమన్వయంతో కలసి పనిచేయాలని ఈ సందర్బంగా సూచించారు.తదుపరి మాస్టర్ ట్రైనర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పోలింగ్ రోజు చేపట్టే విధివిధానాలు వివరించారు.ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి ఏ.డి.ఏ శ్రీధర్ రెడ్డి, ఎల్.డి.ఎం.బాపూజీ, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస రాజు, మాస్టర్ ట్రైనర్లు రమేష్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love