ఉపాధి పనిలో కనీస వసతులు లేవని ఆగ్రహం వ్యక్తం చేసిన కూలీలు

నవతెలంగాణ – శంకరపట్నం
ఉపాధి హామీ పథకం లో తగిన కూలి గిట్టుబాటు కావడం లేదని, బుధవారం గద్దపాక గ్రామంలో ఉపాధి హామీ కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ఉపాధి హామీ పనులు జరుగుతున్న రోజులలో ప్రతిరోజు ఐదు కిలోమీటర్ల నుండి ఏడు గంటల వరకె క్షేత్రానికి వచ్చి 11 గంటల వరకు పనిచేస్తున్న, కనీస కూలి  200 రూపాయలు గిట్టుబాటు కావడం లేదని కూలీలు ఫీల్డ్ అసిస్టెంట్ ఇజిగిరి ఐలయ్య,పై ఆరోపణలు వ్యక్తం చేశారు.అదేవిధంగా పనులు చేస్తున్న వందమంది కూలీలలో కొంతమంది  పనిచేస్తుంటే, మరో కొంతమంది పనిచేయకున్న అందరికీ సమాన వేతనమే లభిస్తుందని కష్టపడి పని చేసే వారిపై అధికంగా భారం పడుతుందని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు.అదేవిధంగా పనులు జరిగే చోట కనీస వసతులు కూడా లేవని  నీరు, మెడికల్ కిట్స్, నీడ కోసం టెంట్ అందుబాటులో ఉంచడం లేదని ఆరోపించారు. ముఖ్యంగా పనిచేసిన చేయకపోయినా తన వాళ్ళకి అందరితోపాటు సమానంగా వేతనం లభించేలా మాస్టర్ లో వేస్తున్నాడని ఆరోపించారు. దీనిపై వెంటనే ఉన్నత స్థాయి అధికారులు స్పందించి విచారణ చేసి తగిన న్యాయం చేయగలరని ఉపాధి హామీ కూలీలు వేడుకుంటున్నారు.
Spread the love