కార్మిక ఉద్యమ నాయకులు పెన్నా అనంతరామ శర్మ:  ఎండి జహంగీర్

నవతెలంగాణ – భువనగిరి
ఉమ్మడి నల్లగొండ జిల్లా కార్మిక ఉద్యమ నాయకులు, వీర తెలంగాణ సాయుధ పోరాట యోధులు పెన్నా అనంతరామ శర్మ భౌతికంగా దూరమైన వారి ఆశయాల కోసం సీపీఐ(ఎం) నాయకత్వం అనునిత్యం ప్రజా పోరాటాల్లో ఉండాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ అన్నారు. గురువారం సీపీఐ(ఎం) నల్గొండ జిల్లా కార్యాలయంలో పెన్నా అనంతరామ శర్మ పార్థివదేహానికి సీపీఐ(ఎం) జిల్లా నాయకత్వం పూలమాలవేసి అరుణాంజలి ఘటించి అనంతరం వారు మాట్లాడుతూ.. యాదాద్రి భువనగిరి ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా కార్మిక ఉద్యమాలను అనేకం నిర్వహించారన్నారు. కార్మిక నాయకునిగా గుర్తింపు పొంది నిరంతరం కార్మిక ఉద్యమాల, వైపు ప్రజా ఉద్యమాల కోసం పరితపించిన నాయకుడని వారు కొనియాడారు. భువనగిరి ప్రాంతంలో కార్మికుల హక్కుల కోసం అనేక కార్మిక సంఘాలను నిర్మించి కార్మిక ఉద్యమానికి పెద్దపీట వేశారని వారన్నారు. కార్మిక నాయకునిగా కార్మిక పోరాటాలతో పాటు ప్రజా జీవితంలో ఆదర్శప్రాయంగా నిరాడంబర జీవితం  గడిపారని తెలిపారు. అనేకమంది యువతకు సీపీఐ(ఎం) నాయకత్వానికి ఆదర్శప్రాయుడిగా నిలిచిన గొప్ప వ్యక్తి అనంతరామ శర్మ అని వారు అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి అనేకమంది కార్యకర్తలను నాయకులను తయారు చేయడంలో చురుకైన పాత్ర పోషించారని వారు అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యునిగా బాధ్యతలు నిర్వహించారని శర్మ గారి మరణం సీపీఐ(ఎం) ఉద్యమానికి, భావితరాలకు తీరని లోటని వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో వారి ఆశయాల కోసం ముందుండాలని వారు అన్నారు. వీరితోపాటు రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్  పాల్గొన్నారు.
Spread the love