సీఎం దృష్టికి జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశం

– దక్కన్‌ సొసైటీకి మంత్రి హరీష్‌ హామీ
నవతెలంగాణ-హైదరాబాద్‌
జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఈ మేరకు డెక్కన్‌ జర్నలిస్ట్స్‌ హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షులు బొల్లోజు రవి, ఉపాధ్యక్షులు ఎం.శ్రీనివాస్‌, కోశాధికారి అయ్యప్ప తదితరులు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల ఇండ్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ ప్రతినిధులు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను వివరించారు. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న హైదరాబాద్‌ సిటీ, రాష్ట్ర స్థాయి జర్నలిస్టులకు మాత్రం ఇండ్ల స్థలాల కేటాయింపు పూర్తి స్థాయిలో జరగలేదన్నారు. చాలీచాలనీ వేతనాలతో జర్నలిస్టులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని గుర్తు చేశారు. ఉద్యోగరీత్యా ఇతర జిల్లాలు, ప్రాంతాల నుంచి హైదరాబాద్‌ వచ్చి పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇంటి అద్దె భారం గుదిబండగా మారిందని గుర్తుచేశారు.

Spread the love