తాత్కాలికంగా ఎమ్‌ఎమ్‌టీఎస్‌ రైళ్లు రద్దు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ డివిజన్ల పరిధిలో రైల్వే మౌలిక సౌకర్యాల నిర్వహణ పనుల మరమ్మతుల కారణంగా ఈనెల 10 నుంచి 16వ తేదీ వరకు తాత్కాలికంగా ఎమ్‌ఎమ్‌టీఎస్‌ రైళ్ల సేవల్ని రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. లింగంపల్లి నుంచి హైదరాబాద్‌, హైదరాబాద్‌ నుంచి లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి, ఉందానగర్‌-లింగంపల్లి, రామచంద్రాపురం-ఫలక్‌నుమా రూట్లలో రైళ్లను రద్దు చేసినట్టు శనివారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపారు.

Spread the love