ఓటింగ్‌ సరళిని పరిశీలించిన ఎమ్మెల్యే

తిమ్మాజిపేట: తిమ్మాజిపేట మండలంలో ఓటింగ్‌ సరళని నాగర్‌ కర్నూల్‌ ఎమ్మెల్యే కుచుకుల్ల రాజేష్‌ రెడ్డి పరిశీలించారు. గోరిట, గుమ్మకొండ, మరికల్‌, తిమ్మాజీపేట గ్రామా లలో ఓటింగ్‌ సరళిని పరిశీలించారు. ఆయా గ్రామాలలో ఈవీఎంలు మొరారయించాయా అని ఎన్నికల అధికారులను అడి గారు. అనంతరం మండల కేంద్రంలో నాయకులతో కలిసి ఓటింగ్‌ ఎలా జరుగుతుందని ఆరా తీశారు. ఆయన వెంబడి మండల నాయకులు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్‌, బాలరాజు, ఉస్మాన్‌, ముబారక్‌, దేవస్వామి, రావుఫ్‌, మేడవులు, బెన్నీ, ఆనందచారి తదితరులు వున్నారు.

Spread the love