
జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు శుక్రవారం నాడు మహాశివరాత్రిని పురస్కరించుకొని రాత్రి మద్నూర్ మండల కేంద్రంలోని సోమ లింగేశ్వర స్వామి ఆలయంలో ఆ పరమ శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నక్క వార్ లక్ష్మణ్ కలిశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారుతీ పటేల్ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వక భేటీ అయ్యారు. ఎమ్మెల్యే వెంటా కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు.