మహమ్మదాబాద్ లింక్ రోడ్డు తవ్వేసి వదిలేశారు..

– దుమ్ము దూళితో ఆరోగ్య సమస్యలు.

– తరుచు ప్రమాదాలకు గురౌతున్న వాహనదారులు.
– పట్టించుకోని సంభందిత శాఖ.
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని మహమ్మదాబాద్ గ్రామము నుండి జుక్కల్ రెండువరుసల రోడ్డు రావలంటే వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. కొన్ని ఏండ్లుగా రోడ్డు గుంతలు, తేలిన కంకరతో రోడంతా గంతలు పడి ప్రమాదాలకు  నిలయంగా రోడు మారింది. నిత్యం రద్దిగా ఉండే రోడు పలు గ్రామాలకు, మండల కేంద్రంనకు వెళ్లడానికి ప్రధానరోడ్డు ఉపయేాగంలో ఉంది. రాజకీయంగా కీలకంగా ఉన్న గ్రామం అయిన రేజు వేసుకోలేక పోయారు. ఎన్నికల ముందు రోడు వేస్తామని తవ్వేసి సన్నం కంకరవేసి  వదిలేసారు. వాహనాలకు దిబ్బగా మారింది. ద్వచక్రవాహనాలు స్కిడ్ అవుతుండటంతో రోజుకో ప్రమాదం జర్గుతోంది. నాయకులు మారీనా, ప్రభూత్వాలు మారిన గ్రామీణ ప్రాంతాల రోడు అద్వానంగా ఉండటం తో పట్టింపులేకుండా పోయింది. నిత్యం అధికారులు, రాజకీయనాయకులు  ఇదే దారీ గుండా ప్రయత్నం వెళ్తున్న పట్టించుకోవడం లేదని మండల వాసులు పేర్కోంటున్నారు.
Spread the love